17 July, 2026 | 1:06 PM

నిరాశ అవసరం లేదు

05-06-2024 01:10 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, జూన్ 4  (విజయక్రాంతి):  రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, 24 ఏళ్ల చరిత్రలో బీఆర్‌ఎస్ ఎన్నో ఒడిదొడుకులు చూసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని, ఎంపీ ఎన్నికల ఫలితాల్లో నిరాశ చెందాల్సిన పనిలేదన్నారు.  లక్షలమంది కార్యకర్తల ఆశీస్సులు, అభిమానంతో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో నిరంతరం శ్రమిస్తామని తెలిపారు.  కాంగ్రెస్, బిజెపి ఎన్నికల హామీలు అమలు చేసేలా నిలదీస్తామన్నారు.