17 April, 2026 | 11:25 AM

నోటీసులకు నో రిప్లై

11-06-2025 01:14 AM

 ప్రైవేట్ పాఠశాల బరితెగింపు,  చర్యలకు  సన్నద్ధమవుతున్న విద్యాధికాలు

 చేర్యాల, జూన్ ౧౦:  చేర్యాల పట్టణంలోని గుర్తింపు లేని పాఠశాలలను గుర్తించి, విద్యాధికారులు నోటీసులిచ్చి 15 రోజుల గడువు దాటినప్పటికీ ఇప్పటివరకు ప్రైవేట్ పాఠశాలలో యజమాన్యం ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. ఈ సంఘటన బట్టి ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం ఎంత బరితెగింపుతో వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది.

గత నెల 22న విద్యాశాఖ అధికారులు  గుర్తింపు లేని పాఠశాలలను గుర్తించి, నోటీసులను జారీ చేసింది. రెండు వారాల్లోగా గుర్తింపు సంబంధించిన పత్రాలను చూపెట్టాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని నోటీసుల ద్వారా తెలియజేశారు. గడు దాటినప్పటికీ ప్రైవేటు స్కూల్లో యజమాన్యాలు విద్యాధికారులకు గుర్తింపు పత్రాలు గాని, సంజాయిషీ గాని ఇవ్వలేదు. రాజకీయ పలుకుబడితో తమను ఎవరు ఏం చేయలేరన్న ధీమాతోనే నోటీసులకు సమాధానం ఇవ్వలేదని ఈ సంఘటన బట్టి అర్థమవుతుంది.

గత రెండు మూడు సంవత్సరాల నుండి ఎటువంటి గుర్తింపు లేకుండానే పాఠశాలలను నిర్వహిస్తున్నారంటే వారి వెనుక బడా బాబుల హస్తం ఉన్నట్టుగా ఇట్టే అర్థమవుతుంది. కార్పొరేట్ స్కూల్లు కావడంతో విద్యాధికారులు కూడా చర్యలను తీసుకోవడానికి వెనుకంజ వేసి, ఆలోచనలో పడుతున్నారు. గల్లీ నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రముఖుల అండదండలు చూసుకునే విద్యాధికారుల మాటలను పెడచెవునా పెడుతున్నాయని జగమెరిగిన సత్యం.

దీంతో యజమాన్యలది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా వ్యవరిస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఫీజులను ఇష్టానుసారంగా పెంచడమే గాక ,పిల్లల తల్లిదండ్రుల నుండి ఫీజులను ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఇష్ట రాజ్యంగా  వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి

 చర్యలకు సిద్ధపడుతున్న అధికారులు 

 విద్యాధికారులు జారీ చేసిన నోటీసులకు పాఠశాలల యజమాన్యం స్పందించకపోవడంతో వాటిపై చర్యలకు పూనుకుట్టునటు  తెలిసింది. పాఠశాలలు ప్రారంభం కాగానే మరలా తనిఖీ చేసి చర్యలకు పై అధికారులకు రిపోర్టు చేయనున్నట్టు  అధికార వర్గాల ద్వారా తెలిసింది.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నారు, ప్రతి సంవత్సరం అకాడమీకియర్ ప్రారంభంలో  ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడతామని ప్రభుత్వం హడావిడి చేసి చేతులు దులుపుకుంటుందని విద్యావంతులు ఆరోపిస్తున్నారు.

గతంలో ఫీజుల నియంత్రణకు తిరుమల రావు కమిటీ వేసినప్పటికీ, ఆ నివేదికను అమలు చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. నిబంధనలను పాటించని పాఠశాలలపై కొరడా ఝలిపించాలని కోరుతున్నారు. అదేవిధంగా కామన్ ఫీజ్  విధానాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టాలి, ప్రైవేట్ పాఠశాలలపై విద్యాధికారులు  ఎప్పటికప్పుడు మా నీటి రింగ్ చేయాలని, పాఠశాలలలో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.