calender_icon.png 9 December, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీనామా చేయలేదు నామినేషన్ రద్దు చేయండి

09-12-2025 07:00:47 PM

ఆర్డీవోకు సర్పంచి అభ్యర్థి ఫిర్యాదు..

అచ్చంపేట: ఇప్పటికే ఉన్న పదవికి రాజీనామా చేయకుండా సర్పంచి స్థానానికి బరిలో నిలిచిన అభ్యర్థి నామినేషన్ రద్దు చేయాలని కోరుతూ ప్రత్యర్థి సర్పంచ్ పదవి పోటీ అభ్యర్థి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లికి చెందిన సత్తు భూపాలరావు.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో సర్పంచి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కాదా ఆయన ప్రస్తుతం ఉప్పునుంతల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్మన్ గా కొనసాగుతున్నారు. లాభదాయకమైన పదవిలో ఉండి దానికి రాజీనామా చేయకుండా.. సర్పంచి ఎన్నికల్లో పోటీ చేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరమని.. దానికి గాను ఆయన నామినేషన్ను రద్దు చేయాలని కోరుతూ, సర్పంచి ఎన్నికల్లో పోటీలో ఉన్న రామచంద్రయ్య అచ్చంపేట ఆర్డిఓ మాధవికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

నిబంధనల మేరకు పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. దీని గురించి ఇప్పటికే ప్రెసిడెంట్ ఆఫీసర్, ఎన్నికల అధికారులకు ఎల్లికిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని చెప్పారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయన నామినేషన్ను తిరస్కరించాలని కోరారు. ఆర్డీవో స్పందిస్తూ.. సర్పంచి అభ్యర్థి నామినేషన్లను తిరస్కరించే పరిధి తనది కాదని.. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు రిజెక్ట్ చేసిన వాటిని మాత్రమే తాను ఆమోదముద్ర వేస్తానని చెప్పారు. ఆర్డీవో కు ఫిర్యాదు చేసిన వారిలో గ్రామస్తులు దిలీప్ రావు, నాగటి మల్లయ్య, మద్దెల బండ బాల లక్ష్మయ్య, నాగలి లింగమయ్య, మాగిని దామోదర్, నాగటి కృష్ణ, సంపంగి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.