30 June, 2026 | 10:46 AM

తెలంగాణలో సర్ జూలై ౩1 నుంచి

15-05-2026 01:06 AM
  1. మూడో దశలో 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు
  2. తెలంగాణలో సెప్టెంబర్ 28న పూర్తి.. అక్టోబర్ 1న తుది జాబితా

తెలంగాణ ఓటర్ల జాబితా ఎప్పుడు విడుదల అవుతుంది?
తెలంగాణలో ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31, 2026న విడుదల చేసి, అక్టోబర్ 1న తుది జాబితాను ప్రకటిస్తారు.

న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)కు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతా ల్లో మూడోదశ ‘సర్’ను నిర్వహిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం గురువారం ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా ల్లో ఓటర్ల జాబితాను వడబోయనుంది.

తాజా రాజకీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అయితే ప్రస్తుతానికి హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లడఖ్‌ను మినహాయించా రు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఝార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి. మూడోదశ సర్‌లో మొత్తం 3.94 లక్షల మంది బూత్‌స్థాయి అధికారులు 36.73 కోట్ల మంది ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. 3.42 లక్షల మంది బూత్‌స్థాయి ఏజెంట్లు కూడా అధికారులకు సహాయపడనున్నారు.

ఇలాంటి తాజా ముఖ్య వార్తల కోసం మా  విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.

ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 23న త్రిపురతో మూడోదశ ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగియనుంది. అన్ని రాష్ట్రాలు ఎస్‌ఐఆర్‌కు సహకరించాలని ఈసీ విజ్ఞప్తి చేసింది. ‘సర్’ మూడో దశ షెడ్యూల్ ప్రకటించిన అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఓటర్లందరూ ప్రత్యేక సమగ్ర సవరణలో ఉత్సాహంగా పాల్గొనాలని, అర్హులైన ఓటర్లు మాత్రమే ఉండేలా.. అనర్హుల పేర్లేవీ చేరకుండా చూసుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామని తెలిపారు.

దేశ రాజకీయాలు, ఎన్నికల అప్డేట్స్ కోసం మా నేషనల్ న్యూస్ విభాగాన్ని సందర్శించండి.

అయితే ఈసీ అధికారిని తెలంగాణ పీసీసీ చీఫ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలవనున్నారు. త్వరలో రాష్ట్రంలో సర్ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో తమకు ఉన్న అనుమానాలను తీర్చాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సీ సుదర్శన్‌రెడ్డిని కాంగ్రెస్ నేతలు కోరనున్నారు. ఇదిలా ఉంటే సర్ మొదటి దశను ఎంపిక చేసిన రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీహార్‌లో నిర్వహించారు. ఇది 2025 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జరిగింది.

తెలంగాణలో తాజా రాజకీయ, ఎన్నికల వార్తల కోసం మా తెలంగాణ వార్తల విభాగాన్ని చూడండి.

దీంతో బీహార్‌లో సుమారు 47 లక్షల మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఇది ఆ రాష్ట్రంలో మొత్తం ఓటర్లలో దాదాపు 5-6 శాతంగా ఉంది. రెండో దశ 2025 అక్టోబర్ 27న ప్రారంభమై, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బంగాల్‌తో సహా 9 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 2.04 కోట్ల ఓటర్లను, పశ్చిమ బంగాల్‌లో 83.86 లక్షల ఓటర్లను తొలగించారు. 

ఏమిటి ఈ ‘సర్’ ప్రక్రియ?

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను శుద్ధి చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిర్వహిస్తోంది. అర్హులైన ఓటర్లు మాత్రమే జాబితాలో ఉండేలా, తప్పులును సరిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు.

ఎంత మంది ఓటర్లు?

ప్రస్తుతం తెలంగాణలో 3.39 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరి వివరాలను బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలించనున్నారు.

ఎందుకు ముఖ్యం?

ఈ ప్రక్రియ ద్వారా:

నకిలీ ఓటర్లు తొలగింపు

కొత్త ఓటర్ల నమోదు

చిరునామా, వివరాల సవరణ

జరిగే అవకాశం ఉంది. ఎన్నికల పారదర్శకతకు ఇది కీలకం.

తెలంగాణ షెడ్యూల్ ఇలా..

* 35,985 మంది బూత్‌లెవల్ అధికారుల నియామకం

* 25,886 మంది బూత్ లెవల్ ఏజెంట్స్

* మే 12 నాటికి 3,39,20,705 మంది ఓటర్లు

* జూన్ 25 నుంచి 24 వరకు ఇంటింటికీ వెళ్లి ఓట్లను తనిఖీ చేయనున్న బీఎల్‌ఓలు

* జూన్ 24న పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్

* జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

* జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణ

* జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారం

* అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల