calender_icon.png 30 December, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో యూరియా కొరత లేదు

30-12-2025 09:04:33 PM

యూరియా కొరత ఉన్నదనే వదంతులను నమ్మవద్దు

జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో యూరియా కొరతలేదని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని యూరియా పంపిణీ కేంద్రాలకు అవసరమైనంత స్టాక్ అందుబాటులో ఉంచామన్నారు. మండలంలో రైతులకు కావలసినంత యూరియా ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా జిల్లా యంత్రాంగం మండల యంత్రాంగం పనిచేస్తున్నది.

ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ రెండు రోజుల్లో జిల్లాలో అందుబాటులోకి వస్తుందని, ప్రతి ఒక్క రైతు ఇంటి వద్దనే ఉండి యూరియా బస్తా బుక్ చేసుకోవచ్చని సర్వర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ క్రింది టోల్ ఫ్రీ నెంబర్ కి 18200595779కు రైతులు ఫోన్ చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల జిల్లా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఏడిఏ విజయచంద్ర, ఏవో మరిపెడ వీరా సింగ్ ఇంచార్జ్ తహసిల్దార్ సుచిత్ర, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర ,తదితరులు పాల్గొన్నారు.