calender_icon.png 30 December, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్దికి సహకారం అందించాలి

30-12-2025 08:59:32 PM

ఆర్డీ-3 జీఎంను సన్మానించిన రచ్చపల్లి పాలకవర్గం

మంథని,(విజయక్రాంతి): తమ గ్రామాభివృద్దికి సింగరేణి సంస్థ ద్వారా సంపూర్ణ సహాకారం అందించాలని రచ్చపల్లి గ్రామ సర్పంచ్‌ కనవేన స్వప్న శ్రీనివాస్‌ ఆర్జీ-3 జీఎం సుధాకర్‌ను కోరారు. మంగళవారం ఆర్జీ-3 జీఎం సుధాకర్‌, ఓసీపీ-2 పీఓ రాజశేఖర్‌లను రచ్చపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘన సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఆమె గ్రామ సమస్యలను జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఆనాడు సింగరేణి సంస్థ కోసం తాము సర్వం ధారపోశామని, తమకు ఏర్పాటు చేసిన ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో పలు సమస్యలు ఉన్నాయన్నారు. సూరయ్యపల్లి నుండి రచ్చ పల్లి ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ వెళ్ళటానికి సరైన రోడ్డు వసతి లేదని, నిత్యం రాకపోకలు సాగించే ఈ రహదారి పూర్తిగా గుంతలమయమై ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ రహదారికి డబుల్‌ రోడ్డు మంజూరీ చేయాలని, అలాగే కమ్యూనిటీ హల్ లో డిన్నర్ హల్ మంజూరు చేయాలని కోరుతూ జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుర్రం సృజన సదానందం, వార్డ్ మెంబెర్ గుర్రాల స్వప్న రాంమూర్తి, సింగనవేన కీర్తన కుమార్, జాగిరి భూమేష్, మాజీ వార్డు మెంబెర్ కొల్లూరి భాగ్య నాగరాజు, ఆశాడాపు సాయి తదితరులు పాల్గొన్నారు.