16-06-2025 01:53:15 AM
- న్యాయం చేయండి అంటూ చీమలపాడు గ్రామంలోని సొసైటీ సభ్యుల ఆందోళన
- పది సంవత్సరాల కల రెండు సంవత్సరాల కష్టం ఈ ర్యాంపు ద్వారా ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
- మాజీ జెడ్పిటిసి ఇర్ప శాంత
చర్ల, జూన్ 15 (విజయక్రాంతి); మండల పరిధిలోగల కొయ్యూరు పంచాయతీలోని చీమలపాడు ఇసుక క్వారీ సొసైటీ సభ్యుల విషయంలో సభ్యత్వం తీసుకొని ఇసుక ర్యాంపు ప్రారంభ దశలో పనులకు వాడుకొ ని ఇప్పుడు పని కనిపించడం లేదంటూ చర్ల మండలం కొయ్యూరు పంచాయతీ పరిధిలోగల చీమలపాడు గ్రామస్తులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక క్వారీకి అ నుమతుల కోసం తమ ఊరు నుంచి సభ్య త్వ రుసుములు తీసుకొని తీరా ఇసుక క్వారీ ప్రారంభించిన తరువాత తమను పట్టించుకోవడం లేదంటూ కొందరు మహిళలు చీమలపాడు గ్రామ రహదారిపై ఆందోళన చేపట్టారు.
ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
ఈ సమస్యపై మాజీ జడ్పిటిసి ఇర్ప శాం త మాట్లాడుతూ కొయ్యూరు పంచాయితీ లోనాలుగు గ్రామాల ప్రజలు మూడు వందల పందొమ్మిది మందితో సిర్రాజు సొసైటీ పేరుతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్న ఈ ర్యాంపు నాలుగు గ్రామాలైన చీమల పాడు, కొయ్యూరు, సుందరయ్య కాలనీ, రామాం జపురం గ్రామాల గిరిజన ఆదివాసీలు లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ క్రమంలో కొం దరు తప్పుడు ప్రచారాలతో చీమలపాడు గ్రామస్తులను రెచ్చగొడుతున్నారని, ఉపాధి అవకా శాన్ని సద్వినియోగం చేసుకోకుండా సొసైటీని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పది సంవత్సరాల కల రెండు సంవత్సరాలుగా అహర్నిశ లు కష్టపడితే కానీ ఈ ర్యాంపు దక్కలేదని, దీని వెనుక ఎంతో కష్టం, ఎంతో ప్రయాస ఉందని మాజీ జెడ్పిటిసి ఇర్ఫాశాంత అన్నా రు. ఇప్పటికైనా ఈ ర్యాంపు ద్వారా ప్రస్తుతం మూడు వందల మంది ఉపాధి పొందుతున్నారని, మిగిలిన వారు కూడా ఇసుక ర్యాం పు పనిలోకి వచ్చి ఉపాధి పొందాలని, ఆం దోళన నిరసనలు చేయాల్సిన పని లేదన్నా రు. ఈ కార్యక్రమంలో చీమలపాడు గ్రామస్తులు ఇర్ప రూప, కాక పార్వతి, కారం స్వప్న, ఎలగాల శాంత కుమారి, బెల్లంకొండ ధనలక్ష్మి, బొడ్డే సంధ్యారాణి, తల్లాడ నాగలక్ష్మి, ఇర్ప సామ్రాజ్యం, చీమల పాడు గ్రామస్తు లు తదితరులు పాల్గొన్నారు.