calender_icon.png 12 July, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాసంస్థల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి

16-06-2025 01:55:09 AM

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

డిగ్రీ కళాశాల భవనాల మరమ్మతులకు ఎమ్మెల్యే శంకుస్థాపన 

భద్రాద్రికొత్తగూడెం, జూన్ 15 (విజయక్రాంతి) : నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ విద్య సంస్థ, వసతి గృహాలలో సకల సౌకర్యాలు కల్పించి విద్యార్థులు, వైద్యసిబ్బంది ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మండల పరిధిలో శ్రీ రామ చంద్ర డిగ్రీ కళాశాలలో రూ.35లక్షల పంచాయతి రాజ్ నిధులతో చేపట్టనున్న భవనాల మరమ్మతు పనులకు ఆదివారం కూనంనేని శంకుస్థాపన చేసి మాట్లాడారు.

గత పాలకులు ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేశాయని,ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ పరిస్థితులను అధిగమించి విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు ప్రేత్యేక ద్రుష్టి సారించామన్నారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, ప్రభుత్వ విద్యసంస్థల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు, విద్యుత్, త్రాగు నీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి జరుగుతోందని, ఇప్పటికే వివిధ పథకాల్లో మంజూరైన నిధులను పెద్దమొత్తంలో విద్యాసంస్థలకు కేటాయిస్తున్నామన్నారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఎంపిడివో అంకుబాబు, ప్రిన్సిపల్ డాక్టర్ సి పద్మ, ప్రొఫెసర్ పూర్ణచందర్ రావు, విద్యుత్ శాఖా ఏఈ రఘురామయ్య, స్థానిక నాయకులు పెదబాబు, కూచిపూడి జగన్, పూనెం శ్రీను, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీను, గౌస్ పాషా, కృష్ణ, మిర్యాల రాము, లగడపాటి రమేష్, రామారావు, దేవరగట్ల రాంబాబు, హరి, మండే హన్మంతరావు, మంద వెంకటేశ్వర్లు, చారి, అఫ్సర్, అయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.