సిబ్బంది ఎవరూ ఆందోళన చెందొద్దు
15-04-2026 01:19 AM
- సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలం
- ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది ఎవరూ ఆందోళన చెందొద్దని, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని ఎండీ నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆర్టీసీ కళాభవన్‌లో డాక్టర్ అంబేద్క ర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) సీహెచ్. వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సాల్మన్, అడ్వైజర్ విజయపుష్ప, సిటీఎంసి శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, సీఈ(ఐటి) శ్రీదేవి, అధికారులు పాల్గొన్నారు.






