15 April, 2026 | 3:28 AM

సెంట్రల్ బ్యాంక్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి

15-04-2026 01:17 AM

నారాయణ సేవా సంస్థాన్‌లో వీల్ చైర్స్ పంపిణీ

హైదరాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి):సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జోనల్ కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి బ్యాంక్ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులుపూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. అనంతరం రాజ్యాంగం, మన దేశ నిర్మాణానికి ఆయన చేసిన గొప్ప కృషిని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా స్థానిక కోఠి వద్ద ఉన్న ఎన్‌జీవో నారాయణ సేవా సంస్థాన్‌లోని విభిన్న దివ్యాంగులకు వీల్‌చైర్‌లను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ ధారాసింగ్, ఉజ్వలకుమార్ చంద్ర డిప్యూటీ జోనల్ హెడ్ (టీఎస్, ఏపీ, కర్ణాటక), హైదరాబాద్ రీజియన్ రీజినల్ హెడ్ గజేంద్రకుమార్ చౌహాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.