25 April, 2026 | 2:00 AM

ఆత్మహత్యలు వద్దు.. చర్చల ద్వారా సాధించుకుందాం

25-04-2026 12:00 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఆత్మహత్యలు వద్దు- చర్చల ద్వారా, ఉద్యమాల ద్వారా డిమాండ్లు సాగించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడితే విలువైన జీవితం కోల్పో తారని, ఆధార పడ్డ కుటుంబాలు, భార్యా, పిల్లలు రోడ్ల పాలవవుతారన్నారు . బతికి పోరాడి సాధించాలి తప్ప,  ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు.

ఈ మేరకు శుక్రవారం విద్యానగర్లోని బీసీ భవన్ లో ఎంపీ ఆర్. కృష్ణయ్య  మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు కొత్త డిమాండ్లు కోరడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారన్నారు. ఇందులో ప్రభుత్వం సాధ్య-సాధ్యా లను కార్మికుల ముందు పెట్టి అంగీకరింప చేయవలసిన బాధ్యత ఉందన్నారు. ప్రభు త్వం ప్రతిష్ట పోకుండా కార్మికుల డిమాండ్లు అంగీకరించాలని కోరారు.

ఆర్టీసీ సమ్మె మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా జన జీవనం స్తంభించిపోయిందన్నారు. ఒకవైపు విద్యార్థులకు పరీక్షల సీజన్ ఇంకొకవైపు పెళ్ళిల్ల సీజన్ ఎంత ప్రాముఖ్యం గల సమయంలో సమ్మె చేస్తున్నందున సమ్మె ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం చాలా దారుణమ న్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని పరిస్థితి విషమించకుండా ముందే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.