14 August, 2026 | 4:10 AM

యూరియా యాప్ వద్దు

14-08-2026 12:48 AM
  1. పాత విధానమే ముద్దు
  2. యూరియా కోసం రామాయంపేటలో రైతుల రాస్తారోకో
  3. గంటపాటు స్తంభించిన రాకపోకలు

రామాయంపేట, ఆగస్ట్ 13: యాప్ కారణంగా పంటలకు సమయానికి ఎరువు దొరకని దుస్థితి నెలకొన్నదని, యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నదని అన్నదాతల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూరియా పంపిణీకి తీసుకొచ్చిన యాప్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతులు గురువారం రామాయంపేటలో మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి సుమారు గంటపాటు రాస్తారోకో చేశారు.

యూరియా కోసం రై తులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా యాప్ విధానాన్ని అమలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.  పాత విధానంలోనే రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు లే కుండా అవసరానికి తగ్గట్టుగా ఎరువులను పం పి ణీ చేయాలని డిమాండ్‌చేశారు.

యూరియా కోసం రైతులు తెల్లవారుజామునే కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. రైతుల రాస్తారోకోతో మెదక్ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యంతో రైతులు రాస్తారోకో  విరమించారు.