calender_icon.png 24 February, 2026 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య లోపాలను సహించేది లేదు

24-02-2026 12:00:00 AM

  1. ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా జరగాల్సిందే 
  2. ట్యాక్స్, ట్రేడ్ లైసెన్సుల ఫీజుల వసూళ్లలో వేగం పెంచాలి
  3. సీఎంసీ కమిషనర్ సృజన
  4. కొంపల్లి సర్కిల్‌లో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు 

హైదరాబాద్,సిటీ బ్యూరో ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, పౌర సేవలు పన్నుల వసూళ్లపై ము న్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు, బకాయిల వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను ము మ్మరం చేశారు.

ఇందులో భాగంగా సోమవారం కొంపల్లి సర్కిల్ పరిధిలో సీఎంసీ క మిషనర్ జి. సృజన ఆకస్మిక పర్యటన నిర్వహించారు. పలు ప్రాంతాల్లోని వీధుల్లో కలి యతిరుగుతూ స్థానిక పరిస్థితులను, పారిశుద్ధ్య నిర్వహణను ఆమె పరిశీలించారు. డోర్-టు-డోర్ చెత్త సేకరణ, ఆస్తి పన్ను వసూ ళ్లు, ట్రేడ్ లైసెన్సుల జారీ తదితర కీలక అం శాలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించి, బాధ్యులైన సిబ్బందికి స్పష్టమైన ఆదే శాలు జారీ చేశారు.

కాలనీల్లో, ప్రధాన రహదారుల వెంట చెత్త పేరుకుపోకుండా ప్రతిరో జూ పక్కాగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.   రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా చెత్తాచెదారం దర్శనమివ్వకూడదని స్పష్టం చేశా రు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికుల హాజ రు, వారి పనితీరుపై సూపర్ వైజర్ల పర్యవేక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహిం చేది లేదని కమిషనర్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

ప్రజల నుంచి పారిశుద్ధ్య సమస్య లపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలని, ఇందుకుగాను వార్డు స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను మ రింత బలోపేతం చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంతో పాటు మున్సిపల్ ఆదాయ మార్గాలైన పన్నుల వసూళ్లపై కూడా అధికారులకు కమిషనర్ దిశానిర్దేశం చేశారు. వాణి జ్య సంస్థల వద్ద ట్రేడ్ లైసెన్సుల జారీ ప్రక్రియను, ఆస్తిపన్ను వసూళ్లను మరింత వేగ వంతం చేయాలని ఆదేశించారు.

ఏళ్ల తరబ డి ఉన్న పెండింగ్ బకాయిల వసూలుకు సం బంధించి తక్షణమే ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. పన్ను చెల్లింపుల్లో పారదర్శకత కో సం డిజిటల్ విధానాలను ఆన్లైన్ పేమెంట్స్ ప్రోత్సహిస్తూ.. వ్యాపారుల్లో, స్థానిక ప్రజల్లో విస్తతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.నగరాన్ని పరిశు భ్రంగా ఉంచుకోవడంలో ప్రజల భాగస్వా మ్యం అత్యంత కీలకమని, స్థానికులను సై తం స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.