24-02-2026 12:00:00 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలలో ఆ నియోజకవర్గం రూటే సపరేటు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎల్లప్పుడు సంచలన ఆరోపణలు చేస్తూ మొదటి పేజీ వార్తగా నిలుస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ పై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
అధికారం ఉంటే ఏదైనా ఎవరిదైనా లాక్కున్నందుకు అవకాశం ఉంటుందా అనే ఆరోపణలకు ముగింపు పలకని చర్చ ఊబందుకుంటుంది. వందల ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయి అంటూ అక్రమ ఇసుక రవాణా ఆ ప్రభుత్వ కాలంలోనే అత్యధికంగా జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలు జనంలో చర్చకు తావిస్తుంది.
ఆధారాలని బయటకి.. చేసినవారు జైలుకు పోతారంట
జడ్చర్ల నియోజకవర్గంలో 600 ఎకరాల భూములు ఓ బీఆర్‌ఎస్ నేత కొట్టేసా రని, ఆ ఆధారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని, కొండకల్, మోకిలా లో 1100 ఎకరాల గిరిజనుల భూములనూ కొట్టేసారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుతుంది. నిజంగానే ఇంత అవినీతి జరుగుతుందా?
ఆ ఆధారాలని బయటకు నిజంగా వస్తాయా అక్రమాలు జరిగింది వాస్తవమేనా అనే సందేహాలకు మరింత కాలం సమాధానం చెబుతుందా లేదా చూడాలి. ఒక్కటి కాదు రెండు కాదు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు లభించే దర్శనం దగ్గర నుంచి, ఇటీవల ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీ పై పర్యావరణ అధికారుల తనిఖీలు చేపట్టే విషయం దాకా ప్రతి అంశంలోనూ జడ్చర్ల ఎమ్మెల్యే తనదైన శైలిలో మాట్లాడే మాటలు కు పదును ఎక్కువగా ఉంటుంది.
దీంతో దినపత్రికలలో అతను నెలలో ఒకటి రెండు సార్లు సంచలన ఆరోపణలు చేస్తూ తెరపైకి వస్తు నేను జడ్చర్ల ఎమ్మెల్యేను ఇక్కడ గతంలో అవినీతి అక్రమాలకు నిలయంగా జడ్చర్ల మారిందంటూ చెబుతున్న మాటలకు మొదటి పేజీ వార్తగా చేస్తున్నాయి. ఇటీవల చేస్తున్న ఆరోపణలకు ముగింపు వస్తుందా? లేదా? కేవలం రాజకీయ ఆరోపణలేనా అనే సందేహం కూడా ప్రజల లోపల చర్చకు దారితీస్తుంది.
ఎమ్మెల్యే చెప్పిన విషయాలని వాస్తవాలని తెరపైకి తీసుకువచ్చి నిరూపణ చేసి కబ్జాదారులు ఎవరైనా ఉంటే వారిని బహిర్గతం చేస్తే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేరు నియోజకవర్గమే కాదు యావత్ తెలంగాణ వ్యాప్తంగా మారుమూగే రోజులు వస్తాయని జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు చెబుతున్న మాట.
త్వరలోనే నిరూపిస్తా: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
గత ప్రభుత్వ హయాంలో గిరిజన భూ ములతో పాటు ఇతర భూములు కూడా కబ్జాకు గురయ్యాయని పూర్తి ఆధారాలతో నిరూపించడం జరుగుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పారు. తమ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక జడ్చర్ల నియోజకవర్గానికి రూ.10 కోట్ల ముడా నిధులను తీసుకొచ్చానని, మరో రూ.6 కోట్ల వరకూ నిధులు గత సమావేశంలో మంజూరు కావడం జరిగిందని వివరించారు.
పెద్దాయపల్లికి ముడా నిధుల నుంచి సీసీ రోడ్లు, డ్రైన్ల కోసం రూ.50 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. ఇది కాకుండా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్, రూ.50 కోట్లతో నవోదయ స్కూల్ కూడా పెద్దాయపల్లిలోనే మంజూరు అయ్యాయని గుర్తు చేసారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను పని చేస్తానని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. కొండకల్, మోకిలా ప్రాంతాల్లో 1100 ఎకరాల గిరిజన భూములను కొట్టేసిన వారు త్వరలోనే జైలుకు వెళ్తారని తెలిపారు.