13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

దుండిగల్ లో బీజేపీ నూతన డివిజన్ అధ్యక్షుల నామినేషన్

31-03-2026 06:52 PM

కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణ

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి విస్తరణ అనంతరం దుండిగల్ సర్కిల్ మూడు డివిజన్లుగా ఏర్పాటు అయ్యింది. బహదూర్ పల్లి 294,బౌరంపేట్ 295,దుండిగల్ 296 గా ఏర్పాటు జరిగింది. మంగళవారం బహదూర్ పల్లి, దుండిగల్ డివిజన్ల బీజేపీ అధ్యక్షుల ఆశావహుళ పేర్లు సర్కిల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీకి పంపించారు. బహదూర్ పల్లి డివిజన్ నుండి అకిబోయిన శ్రీనివాస్ యాదవ్, కావలి సంతోష్, డి.యశ్వంత్, దుండిగల్ డివిజన్ నుండి ఆకుల విజయ్ సాయి, తురాయి భాను గౌడ్,

మాలోత్ వెంకటేష్ నాయక్, తలారి రాజ్ కుమార్, భాస్కర్ నాయక్, తలారి రాజ్ కుమార్, భాస్కర్ నాయక్, నడికట్ల రోజా నామినేషన్ వేశారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ  బీజేపీ ఒక సిద్ధాంతంతో కూడుకున్న పార్టీ అని అన్నారు. పదవుల కోసం కాకుండా జాతీయ భావం దేశభక్తి కలిగి ఉండాలని, కార్యకర్తలు, నాయకులు కలసిమెలసి ఒక కుటుంబంలా ఉండాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో దుండిగల్ సర్కిల్ మూడు డివిజన్ లలో బీజేపీ జెండా ఎగరవేయ్యాలని పిలుపునిచ్చారు.