13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అసెంబ్లీ సమావేశాల్లో బిసి సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించాలి

31-03-2026 06:50 PM

సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్

దేవరకొండ,(విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల్లో బిసి సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించాలి. సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు బీసీ సబ్ ప్లాన్  ఏర్పాటు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధ కల్పించాలనీ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా తాము అధికారంలోకి రాగానే మహాత్మ జ్యోతిబాపూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ చట్టం చేస్తామని ప్రతి ఆర్థిక సంవత్సరంలో బీసీల సంక్షేమానికి 20వేల కోట్ల రూపాయలు కేటాయించి ఐదు సంవత్సరాలకు గాను ఒక లక్ష కోట్లు బీసీల అభివృద్ధికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారని కానీ అమలుకు నోచుకోలేదని అన్నారు. బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన కాకుండా 3.8% కేటాయింపులు చేసి అందులో అర శాతానికి తక్కువ ఖర్చు చేస్తునట్లు  గణాంకాలు సూచిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో  పున్న వెంకటేష్ నేత,పున్న బిక్షమయ్య, జక్కుల అంజి యాదవ్,బొమ్ము శ్రీనివాస్ యాదవ్, పొలమోని శేఖర్ గౌడ్, నట్వా సుధాకర్,చెరుకు అంజి గౌడ్,వెంకట్, శివ తదితరులు పాల్గొన్నారు.