03-12-2024 01:18:43 AM
అన్ని మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్ర
281 పరుగులతో తిలక్ టాప్
న్యూఢిల్లీ: తిలక్ వర్మ వరుసగా రెచ్చిపోతూనే ఉన్నాడు. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ జట్టు గెలిచినా.. ఓడినా.. తిలక్ సునామీకి మాత్రం బ్రేకులు పడడం లేదు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడిన తిలక్ వర్మ 176.73 స్ట్రుక్ రేట్‌తో 281 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. గ్రూప్ ఉన్న హైదరాబాద్ మాత్రం ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది.
టోర్నీ జరిగేదిలా..
దేశీయ టీ20 టోర్నీగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ప్రాచూర్యం పొందింది. 2006 సీజన్ నుంచి ఈ టోర్నీ అనేక మార్పులు, చేర్పులతో కొనసాగుతూ ఉంది. ఈ ఏడాది టోర్నీలో మొత్తం 38 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను ఏ,బీ,సీ,డీ,ఈ గ్రూపులుగా విభజించారు. గతంలో కొత్తగా వచ్చిన జట్లకు ప్లేట్ గ్రూప్ ఉండేది. కానీ ఈ సారి మాత్రం అలా ఆడించట్లేదు. ఏ,బీ,సీ మూడు గ్రూపులలో ఎనిమిదేసి జట్లు ఉన్నాయి. ఆ గ్రూ పుల్లోని ప్రతి జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడుతుంది.
డీ, ఈ గ్రూపులలో ఏడు జట్లు మాత్రమే ఉండగా.. ఒ క్కో జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతి గ్రూ పులో టాప్‌లో నిలిచిన జట్టు నాకౌట్ స్టేజ్‌కు వెళ్తుంది. అంతే కాకుండా ప్రతి గ్రూపులో సెకం డ్ ప్లేస్‌లో ఉన్న జట్ల నుంచి మూడు ఉత్తమ జట్లు కూడా నాకౌట్‌కు చేరుకుంటాయి. నాకౌట్ స్టేజ్‌లో క్వార్టర్ ఫైనల్స్, రెండు సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతుంది. గత సీజన్‌లో ఈ ట్రోఫీని పంజాబ్ కైవసం చేసుకుంది