calender_icon.png 13 September, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యంగ్ ఇండియా ఘన విజయం

03-12-2024 01:11:41 AM

సెంచరీతో మెరిసిన కెప్టెన్ అమాన్ l జపాన్‌ను కట్టడి చేసిన బౌలర్లు

షార్జా: ఏసీసీ అండర్ ఆసియా కప్‌లో యువ భారత్ 211 పరుగుల తేడా జపాన్ మీద ఘన విజయం సాధించింది. గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన భారత్ తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగింది. అయినా కానీ జపాన్‌ను చిత్తు చేసి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన కెప్టెన్ అమాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. బుధవారం యంగ్ ఇండియా తన ఆఖరి లీగ్ మ్యాచ్‌ను యూఏఈతో ఆడనుంది.

మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఆయుష్ అర్ధ సెంచరీ చేయగా.. కెప్టెన్ అమాన్ (122) సెంచరీతో జపాన్ బౌలర్లను చీల్చి చెండాడాడు. 340 పరుగుల భారీ లక్ష్యంతో చేధనకు దిగిన జపాన్‌కు మంచి ఆరంభమే దక్కినా తర్వాత వచ్చిన బ్యాటర్లను మన బౌలర్లు కుదురుకోనివ్వలేదు. జపాన్ లైనప్‌లో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారంటేనే మన బౌలింగ్‌ను అర్థం చేసుకోవచ్చు.

జపాన్ 50 ఓవర్లు ఆడినా కానీ 8 వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో చేతన్ శర్మ, హర్దిక్ రాజ్, కార్తికేయ రెండేసి వికెట్లు తీసుకున్నారు.