11-09-2025 01:37:24 AM
కొత్త ఆదాయ వనరుగా రైతులకు ఆదర్శం
నంగునూరు, సెప్టెంబర్ 10: సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం ముండ్రాయి గ్రామంలో రైతు జాప శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేకంగా నోని (Noni) మొక్కలను సాగు చేస్తున్నారు. మధుమేహ రోగులకు ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ నోని సాగు,
రైతులకు కొత్త ఆదాయ మార్గాలను తెరిచిపెడుతుందని వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు.ఈ నోని మొక్కలను మలేషియాకు చెందిన ౄXN కంపెనీ ఒక సంవత్సరం వయస్సు గల నాణ్యమైన నాటి మొక్కలను రైతు శ్రీకాంత్ రెడ్డికి అందించింది. నోని పండు రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
ఈ మొక్కలకు తక్కువ నీరు అవసరం కావడంతో, పొడి ప్రాంతాలలో కూడా సులభంగా సాగు చేయవచ్చు. ఇది కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా, రైతులకు ఆర్థికంగా కూడా లాభాలను తెచ్చిపెడుతుంది.ఈ సందర్భంగా రైతు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..నోని పంట సాగు చేయడం ద్వారా రైతులకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఈ పండు మధుమేహ రోగులకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ ప్రయత్నం గ్రామీణ స్థాయిలో రైతులకు ఆదర్శంగా నిలుస్తుంది‘ అని అన్నారు.ముండ్రాయిలో సాగు అవుతున్న ఈ నోని మొక్కలు గ్రామీణ వ్యవసాయానికి కొత్త దిశను చూపుతున్నాయి. ఈ కార్యక్రమంలో కరుణాకర్ రెడ్డి, రజినీకా రెడ్డి వంటివారు కూడా పాల్గొన్నారు.