11-09-2025 01:35:55 AM
హనుమకొండ టౌన్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి క్రాస్ రోడ్ లోని మధువని అపార్ట్మెంట్లో ఈనెల 14న ఉదయం 10 గంటలకు జిల్లా అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతుం దని ఆ సంఘం జిల్లా మాజీ అధ్య క్షుడు అర్జుల కిషన్ రెడ్డి తెలిపారు.
బుధవారం హనుమకొండ బాలసము ద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గం కమిటీ కాలపరిమితి 2024 జూన్ ముగిసిందన్నారు. 15 నెలలు గా కమిటీ లేకపోవడం వలన జిల్లాలోని అపార్ట్మెంట్స్‌లోని నివసించే ఓనర్స్ ఎన్నో సమస్యలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొ న్నారు.
ఈ సర్వసభ్య సమావేశానికి జిల్లాలోని అపార్ట్మెంట్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో జిల్లా అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మర్రి రెడ్డి, జిల్లా ప్రతినిధులు కే. రవీందర్, హను మంత్ రెడ్డి, వినయ్ బాబు, ఆర్. మల్లారెడ్డి, వేముగంటి మధుకర్, డిఎంకే రావు పాల్గొన్నారు.