చెన్నై జట్టులోకి నోరోన్హా
ముంబై, మే 13 : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో తడబడి తర్వాత పుంజుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటికే వరుస గాయాలతో ఇబ్బందులు పడుతున్న చెన్నైకి యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
అతడి స్థానంలో సీఎస్కే.. కర్ణాటక ప్లేయర్ మెక్నీల్ హ్యాడ్లీ నోరోన్హాను జట్టులోకి తీసుకుంది. కర్ణాటకకు చెందిన 24 ఏళ్ల ఆల్రౌండర్ నోరోన్హాతో చెన్నై ఒప్పందం చేసుకుంది. గతేడాది మహారాజా ట్రోఫీలో మంగళూరు డ్రాగన్స్ తరఫు న అతడు అద్భు త ప్రదర్శన చేశాడు. 13 మ్యాచ్‌లలో 253 పరుగులు చేశాడు. అందు లో 19 సిక్సర్లు ఉన్నాయి.
అలాగే 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో సయ్యద్ ము స్తాక్ అలీ ట్రోఫీ కోసం కర్ణాటక జట్టులోకి కూడా ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే గత మూడు మ్యా చ్‌లలో అద్భుత ప్రదర్శన చేసి న సీఎస్కే 11 మ్యాచుల్లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే ఆ జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలవాలి.






