14 May, 2026 | 3:09 AM

15 నుంచి హెచ్‌పీఆర్‌సీ ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్

14-05-2026 02:08 AM

మొయినాబాద్, మే 13 : హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్(హెచ్‌పీఆర్‌సీ) ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్ 2026 పోటీలు నిర్వహి స్తోం ది. మే 15 నుంచి 17 వరకూ మూడు రోజు ల పాటు జరిగే ఈ పోటీలకు మొయినాబాద్‌లోని హెచ్‌పీఆర్‌సీ గ్రౌండ్స్ వేదిక కానుం ది. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్, సీనియర్ కేటగిరీల్లో రైడర్లు పాల్గొంటారని హెచ్ పీఆర్‌సీ ప్రెసిడెంట్ చైతన్య కుమార్ చెప్పారు.

తెలంగాణలోనూ ఈక్వెస్ట్రియన్‌కు మరింత ప్రోత్సాహం, ఆదరణ పెంచే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రాస్‌రూట్ లెవెల్ నుంచి ఈక్వెస్ట్రియన్‌ను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని హె చ్‌పీఆర్‌సీ సెక్రటరీ రియాజ్ అహ్మద్ చెప్పారు. మొదటి రోజున ప్రాక్టీస్ సెషన్స్, రెండు, మూడు రోజుల్లో ప్రధాన పోటీలు ఉంటాయని వెల్లడించారు.

ఓపెన్ కేటగిరీలో షో జంపింగ్ 80 సెం.మీ,90 సెం.మీ,105 సెం. మీ విభాగాల్లో ప్రైజ్‌మనీ కూడా అందజేయనున్నారు. మొదటి స్థానంలో నిలిచిన రైడర్ కు రూ.10 వేలు, రెండో స్థానానికి రూ. 7,500 , మూడో స్థానానికి రూ.5 వేలు, నా లుగో స్థానానికి రూ.2500 చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు. తెలంగాణ రైడర్లు తమ సత్తా చాటేందుకు ఈక్వెస్ట్రియన్ ఛాలెం జ్ గొప్ప వేదికని హెచ్‌పీఆర్‌సీ ప్రెసిడెంట్ చైతన్య అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా హెచ్‌పీఆర్‌సీ అంతర్జాతీయ ప్రమా ణాలతో నిర్వహిస్తున్నారు.