అమితాబ్ బచ్చన్.. 'నోస్టాల్జియా'!.. బచ్ పన్ కీ..యాద్ గార్
ముంబయి: చదువుకున్న రోజులను.. మధురమైన బాల్యజ్ఞాపకాలను గర్తుకు చేసుకుంటే ప్రస్తుతం చేస్తున్న పని తాలూకు ఒత్తిడిని మరిచిపోయి రిఫ్రెష్ అవుతామని సైకాలజిస్టులు చెబుతారు. వీటినే సైకాలజికల్ పరిభాషలో నోస్టాల్జియా అంటారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ''కౌన్ బనేగా కరోడ్ పతీ'' షోలో భాగంగా తను కాలేజీ లో చదువుకున్న రోజులను మధురమైన బాల్య జ్ఞాపకాలలను నెమరు వేసుకున్నారు. తన జీవితాన్ని మలుపు తిప్పిన లెక్చర్ ను సైతం షో వీక్షకులతో పంచుకున్నారు.
తాను పది సంవత్సరాలు చదివింది సదరు ప్రొఫెసర్ తన 45 నిమిషాల లెక్చర్ లో చెప్పారని బిగ్ బీ చెప్పారు. తదనంతరం తనకు నచ్చిన సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం, కిరోరీ మల్ కళాశాలలో బీ ఎస్సీ సైన్స్ సబ్జెక్టు తీసుకుని తొలి సారి పరీక్ష తప్పినట్లు తెలిపారు. కాగా మరో సారి పరీక్షకు హాజరు కాగా అతి కష్టం మీద 42 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి.. పరీక్ష గండం గట్టెక్కినట్లు ఊపిరి పీల్చుకున్నానని వివరించారు. 1962 లో అమితాబ్ బీఎస్సీ పట్టభద్రులయ్యారు. 1969లో సినీ రంగంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టారు. తదనంతరం అకిరా కురసోవా నిర్మంచిన సెవన్ సమురాయ్ సినిమాతో ప్రేరణ పొందిన సాత్ హిందుస్తానీ సినిమాతో బిగ్ బీ తెరంగేట్రం చేశారు.






