వృద్ధులందరికీ.. డయాలిసిస్ అవసరం లేదు
ఢిల్లీ: కిడ్నీ వ్యాధి నిర్ధారణ కాగానే ఎంత వయసున్నా సరే డాక్టర్లు డయాలిసిస్ చెయ్యమని సిఫార్సు చేస్తారు. కానీ 75, 80 ఏళ్ల వయసున్న సీనియర్ సిటిజన్స్ విషయంలో డాక్టర్లు ఆచితూచి డయాలిసిస్ సిఫారసు చేయాల్సిందిగా స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. మహా అయితే ఒక వారం, రెండు వారాల జీవిత కాలం పొడిగించగలగే అవకాశం ఉంటుందని అధ్యయనం వివరించింది. అది కూడా సదరు పేషెంటును కనీసం 13 రోజుల పాటు లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తో ఆసుపత్రి లో ఇన్ పేషెంట్ గా ఆ వృద్ధుడు నరక యాతన అనుభవించాల్సి ఉంటుందన్నారు. డయాలసిస్ చెయ్యల్సిన పేషెంట్లను రెండు విభాగాలుగా విభజించారు. సీనియర్ సిటిజన్స్ లలో ఒక గ్రూపు తక్షణం డయాలిసిస్ చేపట్టగా.. మరో గ్రూపు ను కనీసం నెల రోజులు వేచి చూసి తదనంతరం డయాలిసిస్ చేశారు. పేషెంట్ల తాలూకు సదరు రికార్డులు, ర్యాండమైజ్ డ్ క్లినికల్ ట్రయల్స్ ల సహాయంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.






