19 May, 2026 | 2:48 AM

ఒక్క అంగుళం ఆక్రమణ చేయలేదు

25-08-2024 04:00 AM
  1. పట్టా భూమిలోనే ఎన్ కన్వెన్షన్  
  2. హైడ్రా చర్యలు చట్టవిరుద్ధం
  3. సినీనటుడు అక్కినేని నాగార్జున 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఎన్ కన్వెన్షన్ నిర్మాణంలో తుమ్మిడికుంట చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో ఒక్క అంగుళం కూడా లేదని సినీ నటుడు అక్కినేని నాగార్జు న తెలిపారు. హైడ్రా ఆధ్వర్యంలో ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసిన సందర్భంగా నాగార్జున శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. 

అక్కడి చెరువు ట్యాంక్ ప్లాన్‌లో ఎలాంటి ఆక్రమణలు చేయలేదని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణం పూర్తిగా ప్రైవేటు స్థలం, పట్టా భూమిలోనే జరిగిందని స్పష్టంచేశారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసులపై కోర్టు స్టే మంజూరు చేసిందని చెప్పారు. స్టే ఆర్డర్లు ఉండగా, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించిన నిర్మా ణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేయడం బాధాకరం అని పేర్కొన్నారు. హైడ్రా అధికారుల చర్యలు తప్పుడు సమాచారంతో, చట్ట విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.

కూల్చివేత కు ముందు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని చెప్పారు. ఒక వైపు వివాదం కోర్టులో ఉండగా ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే స్వయంగా నేనే కూల్చివేతలు చేసేవాడినని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఈ చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నా రు. ఈ పరిణామాల వల్ల ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. 

ఎన్‌న నిర్మాణంలో చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని పునరుద్ఘాటించారు. తమ ప్రతిష్టను కాపాడుకో వటం కోసం వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే సమాచారాన్ని పంచుకుంటున్నట్టు పేర్కొన్నారు.