17 March, 2026 | 9:52 PM

ద్రోణాచార్యుడ్ని కాదు.. మట్కా కింగుని!

03-11-2024 12:00 AM

వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం లో డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో శనివారం మెగాస్టార్ చిరంజీవితో మూవీ ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేయించారు మేకర్స్. ట్రైలర్‌లో వాసు క్యారెక్టర్‌లో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశారు వరుణ్. ‘వేలు తీసుకొని వదిలేయడానికి నేను ద్రోణాచార్యుడ్ని కాదు.

మట్కా కింగుని’ అంటూ తేజ్ చెప్పిన డైలాగులు పేలాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారికి ట్రైలర్ చాలా నచ్చింది. చాలా మాస్‌గా ఉందని ఆయన కాంప్లిమెంట్ ఇవ్వడం ఆనందాన్నిచ్చింది’ అన్నారు. ప్రొడ్యూసర్లు రజిని తాళ్లూరి, డాక్టర్ విజయేందర్‌రెడ్డి, నటుడు కార్తికేయ, చిత్రబృందం పాల్గొన్నారు.