04-07-2025 12:00:00 AM
నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా ‘తమ్ముడు’. శ్రీరామ్‌వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ.. చిత్ర అనే పాత్రలో కనిపించనుంది. జూలై 4న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను వర్ష పంచుకుంది. “కొన్ని సినిమాలు థియేటర్లలోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ‘తమ్ముడు’ అలాంటిదే. ఇందులో ‘చిత్ర’ పాత్ర కోసం నా లుక్‌టెస్ట్ ఓకే కాగానే ‘అడవిలో షూటింగ్ చేయాల్సి ఉంటుంది..
ఇబ్బంది ఉంటే ఇప్పుడే చెప్పండి’ అని డైరెక్టర్ అన్నారు. సవాల్‌గా భావించి.. చేస్తాను అని చెప్పా. హీరో నితిన్ క్యారెక్టర్ ‘జై’కి నా పాత్ర డ్రైవింగ్ ఫోర్స్‌లా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే వెంటనే అడుగువేసే తత్వం ‘చిత్ర’ది. అయితే, నిజ జీవితంలో నేనలా కాదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే నా కోరిక ఈ సినిమాతో నెరవేరింది. తమిళంలో ‘బిగిల్’ తర్వాత శారీరకంగా శ్రమించిన చిత్రమిదే. మారేడుమిల్లి దట్టమైన అడవి.
వర్షాకాలంలో పాములు, తేళ్లు కనిపించేవి. రాత్రిపూట షూటింగ్. కాగడాలు పట్టుకుని నటించాం. నితిన్ చాలా కామ్‌గా ఉంటారని అంటారు కానీ, చాలా ఫన్ పర్సన్. అందరికీ గౌరవం ఇచ్చేవారు. నేను హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలాంటి తేడాలు చూడను. నిత్యామీనన్‌లాగే పర్‌ఫార్మర్‌గా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా. ప్రస్తుతం రెండు వెబ్‌సిరీస్‌లు చేస్తున్నా. మరో రెండు సినిమాలూ ఓకే అయ్యాయి. సైకో కిల్లర్ క్యారెక్టర్‌లో కనిపించాలనేది నా కోరిక.