02-07-2025 01:31:12 AM
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో శాఖల మధ్య పంచాయితీ
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో శాఖల మధ్య పంచాయితీ నడుస్తోంది. తప్పు మాది కాదంటే మాది కాదంటూ పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఒకరిపై మరొకరు నెట్టేసుకుంటున్నారు. మరోవైపు ఈ నియామకాల్లో అవినీతి జరిగిందని, నివేదికలను బహిర్గతం చేసి తుది ఫలితాలను విడుదల చేయాలని గత కొంత కాలంగా స్పోర్ట్స్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంలో ఇప్పటికే మూడుసార్లు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. అయితే ఈవిషయంలో ఎలా ముందుకు పోవాలనే దానిపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు వివరణ కోరుతామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ మంగళవారం ఆయనను కలిసిన విలేకరులతో తెలిపారు.