02-07-2025 08:20:51 AM
డాక్టర్స్ డే రోజు ఘటన
వైద్యుల నిర్లక్ష్యమే అంటున్న బాధితులు
భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): కలెక్టర్ సతీమణి ప్రసవించిన ప్రభుత్వ ఆసుపత్రిగా పేరు అందిన పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి(Palvancha Government Hospital) ప్రసవానికి వచ్చిన ఓ మహిళ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పండంటి బిడ్డను కోల్పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ డే రోజు(Doctors' Day) ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని మందిరం పాడు గ్రామానికి చెందిన కోరం కరుణ మంగళవారం ఉదయం పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు నార్మల్ డెలివరీ కోసం వైద్యుల ప్రయత్నం చేశారు. ఆపరేషన్ చేసి బిడ్డల బయటకి తీయని ఎంత వేడుకున్నా వైద్యులు ససేమిరా అన్నారు. ఈలోగా కడుపులోనే పుష్షు మరణించడంతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసి బంధువులు అప్పగించారని బాధితురాలి బంధువు వజ్రా లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు. డాక్టర్ సతీమణి పురుడు పోసుకున్న ఆసుపత్రి అని నమ్మకంతో ఆస్పత్రికి వస్తే బిడ్డను బలి తీసుకున్నారంటూ తల్లి కరుణ, లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు వైద్యులు సమాచారం ఇవ్వకుండా దాట వేశారు.