02-07-2025 09:54:37 AM
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) బుధవారం బ్రెజిల్ సహా ఐదు దేశాలలో ఎనిమిది రోజుల దౌత్య పర్యటనకు బయలుదేరారు. అక్కడ ఆయన బ్లాక్ సమావేశంలో పాల్గొంటారు. జూలై 2 నుండి జూలై 9 వరకు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను సందర్శిస్తారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) తన ఐదు దేశాల పర్యటనను ఘనాతో ప్రారంభిస్తారు. ఇది ఆఫ్రికన్ దేశానికి ప్రధానమంత్రి తొలి ద్వైపాక్షిక పర్యటన, ఐదు దశాబ్దాల తర్వాత అర్జెంటీనాకు భారత ప్రధాని చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటన అవుతుంది.
నేడు, రేపు ప్రధాని మోదీ ఘానాలో పర్యటించనున్నారు. మూడు దశాబ్దాల తర్వాత ఘానాలో భారత ప్రధాని(Prime Minister of India) పర్యటించడం ఇదే మొదటి సారి. రేపు ఎల్లుండి ట్రినిడాడ్-టిబాగోలో ప్రధాని పర్యటించనున్నారు. 1999 తర్వాత ట్రినిడాడ్-టొబాగోకు భారత ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నెల 4,5 తేదీల్లో నరేంద్ర మోదీ అర్జెంటీనాకు వెళ్లనున్నారు. రక్షణ, వ్యవసాయం, చమురు, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబుడులు, గనులపై అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్(Argentine President Javier Miele) మిలేతో చర్చించనున్నారు. ఈ నెల 5న ప్రధాని మోదీ బ్రెజిల్ పర్యటనకు వెళ్లనున్నారు. రియోడీజనీరో వేదికగా ఈ నెల 6,7 తేదీల్లో బ్రిక్స్ 17వ సదస్సుల్లో పాల్గొనున్నారు. పవాల్గాం దాడి ఘటనను బ్రిక్స్ సదస్సు ఖండించిన విషయం తెలిసిందే. భారత్ ప్రతిపాదన మేరకు బ్రిక్స్ సదస్సు(17th BRICS Summit) తీర్మానం చేయనుంది. ఈ నెల 9న ప్రధాని మోదీ నమీబియాలో పర్యటించనున్నారు. నమీబియాలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గత 11 ఏళ్లలో మోదీ అతిపెద్ద సుదీర్ఘ దౌత్య పర్యటన ఇది.
ద్వైపాక్షిక, ఇతర అంశాలపై ఆయా దేశాల అధినేతలతో చర్చిస్తానని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఆయా దేశాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. ఘానాతో భారత్ స్నేహ సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని నరేంద్ర మోదీ వెల్లడించారు. రేపు ఘనా పార్లమెంటులో మాట్లాడటం గొప్ప అవకాశంగా ఆయన అభివర్ణించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోతో చారిత్రక సంబంధాలు కొనసాగిస్తామన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సహకారం బలోపేతం దిశగా చర్చలు జరపనున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.