02-07-2025 10:27:49 AM
హైదరాబాద్: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం పోలీస్ స్టేషన్(Police station suraram) పరిధిలో బుధవారం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కట్టమైసమ్మ చెరువు మూలమలుపు వద్ద చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో చెరువు ఇనుపకంచె ధ్వంసం కాగా, కారులో ఉన్న వ్యక్తులు కారును వదిలేసి పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, క్రేన్ సహాయంతో కారును చెరువులోంచి బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారును స్థానిక వ్యాపారికి చెందినగా గుర్తించారు.