calender_icon.png 3 July, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

02-07-2025 10:57:31 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత మూడ్రోజులుగా భారీ వర్షాలు(Rains) కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం(Srisailam) జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోందిఎగువ ప్రాంతామైన జూరాల నుంచి శ్రీశైలానికి 83,224 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని అధికారులు బుధవారం వెల్లడించారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు, శ్రీశైలం జలాశయంలో(Srisailam Reservoir) ప్రస్తుత నీటిమట్టం 875.20 అడుగులు, శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్ల 215.7080 టీఎంసీలు, శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 164.7532 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి అవుతోంది. విద్యుదుత్పత్తి చేసి 35,315 క్యూసెక్కులు సాగర్ కు విడుదల చేశారు.