02-07-2025 10:05:50 AM
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో బుధవారం బాలిక అదృశ్యం అయింది. గత నెల 28న బిహార్ వెళ్తేందుకు బాలిక కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. వాటర్ బాటిల్ కొనుగోలు పేరుతో బయటకు వెళ్లి బాలిక తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై అపహరణ కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు(Police Station Gopalapuram) బాలిక నీళ్ల బాటిల్ కోసం రైల్వే స్టేషన్ నుంచి అల్ఫా హోటల్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.