13 April, 2026 | 3:42 AM

ఐసీసీఎస్, ఎన్‌హెచ్‌ఎం ప్రైవేటీకరణ ఆపాలి

02-07-2025 01:30 AM

- 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం

- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ 

చెన్నూర్, జూలై1: ఐసీసీఎస్, ఎన్‌హెచ్ ఎం ప్రైవేటీకరణ ఆపాలనీ, అంగన్వాడీ, ఆశా వర్కర్స్‌కు కనీస వేతనం చెల్లించాలనీ సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం చెన్నూరు పట్టణ కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, ఆశా వర్కర్స్‌లతో ఈ నెల 9న జరిగే దేశ వ్యాప్త సమ్మె కరపత్రం విడుదల చేసిన  అనంతరం ఆయన మాట్లాడారు.

ప్రైవేటీకరణలో భాగంగా ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేస్తూ ఎన్‌ఈపీ చట్టాన్ని తెచ్చిందని, ఐసీడీఎస్ నిర్వహ ణ ఖర్చులో కేవలం 60 శాతం మాత్రమే రాష్ట్రాలకు చెల్లిస్తుందన్నారు. ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, ఆశా వర్కర్స్ అందరూ భాగస్వాములు కావాలని  పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు ఇందిరా, అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సభ్యు లు శ్రీలత, రాజేశ్వరి, శారదా,  ప్రవీణ, సీఐటీయూ మాజీ జిల్లా కార్యదర్శి సంకె రవి, వృత్తి దారుల సంఘం జిల్లా కార్యదర్శి బోడేంకి చందు, తదితరులు పాల్గొన్నారు.