నిరుద్యోగ మార్చ్ కాదు.. బీఆర్‌ఎస్ కార్యకర్తల మార్చ్
21-06-2024 02:03 AM
పీసీసీ అధికార ప్రతినిధులు ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని పీసీసీ అధికార ప్రతినిధులు రియాజ్, చనగాని దయాకర్, రవళిరెడ్డి, లింగంయాదవ్ అన్నారు. ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగుల మార్చ్ పేరుతో బీఆర్‌ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. అది నిరుద్యోగ మార్చు కాదని, బీఆర్‌ఎస్ కార్యకర్తల మార్చ్ అని ఎద్దేవా చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అశోక్‌కుమార్ వెనుక కేటీఆర్ పైసల ముఠా ఉందన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేసే ముందు బీఆర్‌ఎస్ నాయకులు ఒళ్లు జాగ్రత్త పెట్టుకోవాలని హెచ్చరించారు.






