11 July, 2026 | 8:54 PM

Breaking News

సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల 16వ స్నాతకోత్సవం   •   జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •  

బెజ్జంకిలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

11-07-2026 07:55 PM

బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బండి సంజయ్ దేశాభివృద్ధి, ప్రజాసేవలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన సేవలను ప్రశంసించారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి, మరిన్ని సేవలు చేసే అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు, నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.