మాటలే తప్ప హామీల అమలు లేదు
విఓఎల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి మాజీ ఎమ్మెల్యే మెచ్చా
దమ్మపేట, మే 26 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట వి ఓ ఎ లు వారి సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మెకు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు బి ఆర్ ఎస్ పార్టీ తరుపున మద్దతు తెలిపారు. వారికి మజ్జిగ ప్యాకెట్లు, నిమ్మ సోడాను అందజేశారు. వారి ఆవేదనను, సమస్యలను విని వారికి అండగా బి ఆర్ ఎస్ పార్టీ నిలబడుతుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో మానవీయ కోణంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 3000 నుంచి 5000 లకు జీతాలు పెంచారని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని గాలికి వదిలేశారాని మండిపడ్డారు. ఈ రెండేండ్లలో విపరీతమైన పని చేయించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని చిన్న చూపు చూడడం సరికాదని, వెంటనే వి ఓ ఎ ల డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున వారితో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ రమేష్, దారా యుగంధర్, పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల, బి ఆర్ ఎస్ నాయకులు అబ్దుల్ జిన్నా, యార్లగడ్డ శ్రీనివాస్ రావు, చీకటి రామయ్య తదితరులు ఉన్నారు.






