ఇక అర్బన్ నక్సల్స్ పని!
ఒళ్లు దగ్గరపెట్టుకోండి!
- విద్యార్థులను దేశద్రోహులుగా తయారు చేయొద్దు
- బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కుహనా మేధావులు, కుహనా లౌకికవాదులు కొందరు ఈ దేశంలో ఉన్నారని, వారిని ఇప్పుడు అర్బన్ నక్సల్స్‌గా పిలుస్తున్నామని.. వారు దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా కొంతమంది దేశ వ్యతిరేకంగా విద్యార్థులను తయారు చేస్తున్నారని ఆరోపించారు.
దేశాన్ని రెండు ముక్కలుగా చేయాలనే వారికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని విమర్శించారు. పిల్లలకు చదువుచెప్పా లే గానీ, వారిని దేశద్రోహులుగా తయారుచేయొద్దని.. అర్బన్స్ నక్సల్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు.
నక్సల్స్ పనిఅయిపోయింది కదా.. యూనివర్సిటీల్లో ఉం టూ అర్బన్స్ నక్సల్స్‌గా తాము ఇంకా మిగిలే ఉన్నామనే భ్రమలో ఉండొద్దని, మీ పని కూ డా పడతరు.. మీ అంతు కూడా చూస్తరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చ రించారు. వారు ఒళ్లు దగ్గరపెట్టుకొని ఉండాలని, విశ్వవిద్యాలయాలు, విద్యార్థులను పాడు చేయొద్దని కోరారు.
ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్లు లొంగిపోతున్నారని, తెలంగాణలో కూడా కీలక మావోయిస్టులు సరెండరయ్యారని, మరికొంత మంది మిగిలి ఉన్నారని తెలిపారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇద్దరు కూడా ఒకరు సీపీఐని బతికిస్తుంటే, మరొకరు సీపీఎంను బతికిస్తున్నారని విమర్శించారు.
దేశంలోనే కాకుండా తెలంగాణను కూడా మావోయిస్ట్ ముక్త్‌గా చేయాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోందని పేర్కొన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీఆర్‌ఎస్ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా మీడియా సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు.
ఏఐ సమ్మిట్‌లో..
దేశానికి గర్వకారణంగా ఒక ప్రతిష్ఠాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను అంతర్జాతీయ స్థాయి లో నిర్వహిస్తే, అందులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి అర్ధనగ్నంగా నిరసన తెలపడం అత్యంత సిగ్గుమాలిన చర్య అని, ఇది దేశ ప్రతిష్ఠను ప్రపంచం ముందు దిగజార్చే పని అన్నారు. ఏఐ సమ్మిట్‌ను కాం గ్రెస్ పార్టీ.. అబ్యూస్ ఇండియా, అగనెస్ట్ ఇండి యా, యాంటి ఇండియా కార్యక్రమంగా మార్చుకుందని విమర్శించారు.
ఆ నిరసనను పూర్తిగా రాహుల్ గాంధీ చేయించిన సిగ్గుమాలిన చర్య అని, ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇండీ అలయెన్స్ కూటమి భాగస్వామ్య పార్టీలు సైతం బహిరంగంగానే వ్యతి రేకించాయన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాం ధీ దేశ యువతకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీపై విశ్వాసం పెరుగుతున్నదని ఆయన తెలిపారు.
రాంచందర్ రావు సమక్షంలో.. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీకూకట్‌పల్లి ఇన్‌చార్జ్ మాధవరం కాంతా రావు ఆధ్వర్యంలో వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో వారికి రాంచందర్‌రావు పార్టీ కండువా కప్పి స్వాగ తం పలికారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్‌ఎస్ నుంచి గతంలో కార్పొరేటర్‌గా పోటీ చేసిన లంకల రమేశ్ రెడ్డి, విజేశ్వర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి కాగా, యూత్ కాంగ్రెస్ నాయకులు శివశశీకర్, వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, నరేష్ కుమార్‌తో పాటు న్యాయవాది శివకుమార్ ఉన్నారు.
మావోయిస్టులు చేసింది హింసనే..
గత 45 ఏండ్లుగా మావోయిస్టులు ప్రజలకు చేసిందేమీలేదని, వారిది హింస మాత్రమేనని రాంచందర్‌రావు అన్నారు. పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో నిరపరాధ ప్రజలను హత్య చేయ డం, బీజేపీ నాయకులపై దాడులు చేయడమే వారి పనిగా మారిందన్నారు. వారి ఉద్యమం భూస్వాములను కాపాడడానికే పరిమితమైంది తప్ప, భూ స్వాములకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్రకాదని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31లోపు దేశాన్ని నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి చేయాలనే లక్ష్యంతో ముం దుకెళ్తోందని, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న ఆపరేషన్ కగార్ వంటి చర్యలతో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. కేం ద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు పెద్దసంఖ్యలో మావోయిస్టులు తుపాకులు వదిలి లొంగిపోతున్నారన్నారు.




