calender_icon.png 4 May, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక యాక్షన్ ప్లాన్

04-05-2025 01:31:20 AM

  1. జూన్ 9 మహాధర్నా తర్వాత భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
  2. సీఎస్‌ను కలిసి పెండింగ్ డీఏలు, బకాయిలు ఇవ్వాలని వినతి
  3. నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల రాష్ట్రస్థాయి సదస్సు

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు సర్కార్ తీరుపై  గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను ఇంతవరకు పరిష్కరించలేదని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.. మరీముఖ్యంగా కిందిస్థాయి ఉద్యోగుల్లో తీవ్ర అసహనం కనిపిస్తుంది.

దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉ న్న ఉన్న సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్త్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యో గుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వ ర్యంలో జేఏసీ నేతలు శనివారం సీఎస్ రామకృష్ణారావును  సచివాలయంలో కలిసి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు నేడు (ఆదివారం) తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల రాష్ట్రస్థాయి ఉద్యోగ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తమ సమస్యలను పరిష్కరించ కుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యో గుల జేఏసీ ప్రకటించినట్టుగా జూన్ 9న భారీస్థాయిలో మహాధర్నా చేపట్టనున్నారు.

ఈలోపు ప్రభుత్వం దిగివొచ్చి పెండింగ్ సమస్యల్లోని 5 డీఏలు, రూ.10 వేల కోట్ల వరకు ఉన్న బకాయి బిల్లులు, పీఆర్సీ అమ లు, ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, సీపీఎస్ రద్దు వంటి ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తే ఆలోచిస్తామని జేఏసీ నేతలు చెబుతున్నారు. అలాకాకుండా ఎప్పటిలాగే కాలయాపన చేస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెగేసి చెబుతున్నారు.

చాలాకా లంగా పెండింగ్‌లో ఉన్న 57 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తుంది సీఎం, డి ప్యూటీ సీఎం, మంత్రులు, అధికారులను తా ము ఎన్నిసార్లు కలిసినా ఒక్క అడుగు ముం దుకు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలోని ఉద్యోగుల నుంచి తమపై వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించాల్సి వస్తోందని ఓ ఉద్యోగ జేఏసీ నేత తెలిపారు.

ప్రధానమైన డిమాండ్లు

* పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు వెంటనే విడుదల చేయాలి. 

* 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులు క్లియర్ చేయాలి. ఇ వ్యవస్థను రద్దు చేస్తూ ట్రెజరీ విభాగం ద్వారా బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలి.

* ధరల పెరుగుదల ప్రకారం 51 శాతం ఫిట్‌మెంట్‌తో 2వ పీఆర్సీ సిఫార్సులను అమలు చేయాలి.

* ఉద్యోగులు, పెన్షనర్ల కాంట్రిబ్యూషన్‌తో ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) అమలు చేయాలి.

* కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ.

* ఏప్రిల్  మే నెలల్లోనే సాధారణ బదిలీలు చేపట్టాలి.

* జీవో 317ను సమీక్షించి, బాధితుల బదిలీల కోసం సూపర్ న్యూమరరీ పోస్టుల ను కల్పించి.. వీలైనంత త్వరగా స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి వారి స్థానిక జిల్లాలకు కేటాయించాలి.

ఉద్యోగులు పేర్కొంటున్న డింగ్ డిమాండ్లు

* అన్ని శాఖలలో పనిభారాన్ని తగ్గించేందుకు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అదనపు క్యాడర్ స్ట్రెంత్‌ను మంజూరు చేయాలి.

* రంగారెడ్డి జిల్లా ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ, ఉద్యోగులకు రవాణా సౌకర్యాలు కల్పించడం.

* కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం. భవిష్యత్ నియామకాలలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయ డం, మినిమమ్ టైమ్ స్కేల్ అమలు.

* సర్వశిక్షా అభియాన్ వంటి కేంద్ర ప్రయోజిత పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్, కేజీబీవీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ.

* ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు.

* సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి రెండు నెలల ముందు చేపట్టిన బదిలీలను రద్దుచేసి, పాత స్థానాలకు బదిలీ చేయడం.

* రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్/ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. ప్రధాన ఉద్యోగ సంఘాలకు గుర్తింపునివ్వాలి.

* పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు, మెడికల్ ఇన్‌వాలిడేషన్ల క్లియరెన్స్ కోసం రాష్ట్రస్థాయిలో మెడికల్ ఇన్‌వాలిడేషన్ కమిటీని ఏర్పాటు చేయాలి.

* పీఆర్సీ బిల్లులకు సంబంధించిన క్లెయిమ్‌లను ఆర్థికశాఖకు బదులుగా ట్రెజరీలు/పీఏవో డిపార్ట్‌మెంట్ ద్వారా అడ్మిట్ చేయడానికి అనుమతి, పీఆర్సీ 2020కు ముందు బిల్లులను అనుమతించే ఆలస్యాన్ని నివారించడానికి దాని సమయాన్ని 31.3.2023 నుంచి 31.3. 2026 వరకు వ్యవధిని పొడిగించాలి.

* పదవీ విరమణ అనంతరం సర్వీస్ పొడిగింపు, రీ-ఎంపాయిమెంట్ చేయొద్దు. తద్వారా సర్వీస్‌లో ఉన్న జూనియర్ ఉద్యోగుల ప్రమోషన్ ప్రయోజనాలు కాపాడాలి.

* గ్రేడ్ 1, 2, 3, 4 కింద గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగులు/ క్యాడర్ కేటాయింపు, నియామక తేదీ నుంచి సర్వీస్‌ను లెక్కిస్తూ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కాలాన్ని 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించి ప్రమోషన్లు కల్పించడం.

* పరిపాలన అసౌకర్యాన్ని నివారించడానికి ప్యానెల్ సంవత్సరం మొదటి సెప్టెం బర్ నెలలో అన్ని విభాగాలలో డీపీసీలను నిర్వహించడం ద్వారా అర్హులైన ఉ ద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలి.

* మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు సంబంధించి జీవో 142, పోలీస్ శాఖ జీవో నెం.42ని పునఃసమీక్షించాలి.

* ఇటీవల ప్రభుత్వం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి అధ్యక్షతన ఉద్యోగుల ఫిర్యాదులను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పా టు చేశారు. నిబంధనలతో పాటు ఈ విషయంలో అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేయాలి.

* ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ క్యాడర్ స్ట్రెంత్‌ను ఆమోదించాలి.

* హెచ్‌వోడీల నుంచి సెక్రటేరియట్‌కు బదిలీలపై నియామకాల కోసం 12.5 శాతం కోటా అమలు చేయాలి.

* శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి వద్ద సర్వెనెం.37లో ఉన్న టీఎన్‌జీవో ఫేస్-2కు చెందిన 101.02 ఎకరాల స్థలాలను టీఎన్జీవో ఎంసీహెచ్‌ఎస్ లిమిటె డ్‌కు ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి.

* గోపన్నపల్లిలోని సర్వే నెం.36, 37లో ఉన్న భాగ్యనగర్ టీఎన్జీవో మ్యుచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకు ఇంటి స్థలాల భూమి కేటాయింపు.

* ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్-4 ఉద్యోగులలో మిగిలిపోయిన 50 మంది ఉద్యోగులు, 9, 10వ షెడ్యూల్స్ స్థానికత జిల్లా, జోనల్, మల్టీ జోనల్, అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌లో పనిచేస్తున్న తెలంగా ణ వారిని తెలంగాణకు తీసుకురావాలి.

* జిల్లా ప్రజా పరిషత్ వ్యాధిగ్రస్థ ఉద్యోగులపై ఆధారపడిన పిల్లలు/కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలి.

* రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్య విధాన పరిషత్, గ్రంథాలయ సంస్థ, మార్కెటింగ్ కమిటీ, ఎయిడెడ్ సంస్థ ఉద్యోగులకు హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా జీతభత్యాలు చెల్లించాలి.

* నర్సింగ్ డైరెక్టరేట్‌ను మంజూరు చేయాలి.

* రాష్ట్రంలోని 2.9 లక్షల మంది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక పెన్షనర్స్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి. అసోసియేషన్ల భవనాలకు స్థలాలు కేటాయించాలి.

* ఉద్యోగులపై ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తదితర కేసులకు సంబంధించిన ఫైళ్లను వేగవంతంగా క్లియరెన్స్ చేసి, కమి టీ వేయడం, విచారణను వేగవంతం చేసి ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి.

* ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఉన్నత విద్యార్హతలను పొందేందుకు ఓబీ సౌకర్యాన్ని అందించడానికి జీవో నెం.342 పునరుద్ధరణ చేయాలి.

* మరణించిన వీఆర్‌ఏ కుటుంబ సభ్యులకు కారుణ్యనియామకాలు చేపట్టాలి.

* వీఆర్‌వో, వీఆర్‌ఏలను తిరిగి రెవెన్యూశాఖకు తీసుకురావాలి.

* ఓల్డ్ పెన్షన్ సిస్టమ్/కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ అమలు చేయకుండా ఉస్మానియా వర్సిటీలో పక్కనపెట్టిన ఆర్డర్లను రద్దు చేయాలి. సీపీఎస్/ఓపీఎస్‌ను అమలు చేయాలి.

* గురుకుల, మోడల్ స్కూల్ టీచర్లందరికీ ప్రతినెలా 1న వేతనాలు చెల్లించాలి.

* అన్ని జిల్లాలకు డీఈవో పోస్టులు, డీఐఈవో పోస్టులు, విద్యాశాఖలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు డిప్యూటీ ఈవో పోస్టులు, అన్ని మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలి.

* క్లాస్-4 ఉద్యోగుల అన్ని ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా పూరించాలి. ఉద్యోగ సంఘానికి జిల్లాలలో, రాష్ట్రస్థాయిలో అసోసియేషన్‌లకు కార్యాలయా లకు స్థలాలు మంజూరు చేయాలి.

* ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ మంజూరు చేయాలి.

* ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.

* స్పెషల్ టీచర్స్‌కు (398) నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలి.

* 1/9/2004 కంటే ముందు, నోటిఫికేషన్ జారీచేసిన ఆ తర్వాత నియామ కాలు చేపట్టిన ఉద్యోగులకు సీపీఎస్ నుంచి ఓపీఎస్‌ను అమలు చేయాలి.

* గత 35 సంవత్సరాల నుంచి మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఉర్దూ అకాడమీలో పనిచేస్తున్న 142 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కు జీవో నెం.14 ప్రకారం పీఆర్సీ అమలు చేయాలి. జీవో నెం.60 ప్రకారం కనీస వేతనం, అరియర్స్‌తో సహా చెల్లించి, వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలి.

* దివ్యాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెండిగ్‌లో ఉన్న మూడు పీఆర్సీలను అమలు చేయాలి.

* పెన్షన్ క్యూటేషన్‌ను 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇతర రాష్ట్రాల్లో అమలవు తున్నట్టుగానే తెలంగాణలో కూడా అమలు చేయాలి.

* టీజీఎల్‌ఐ బోనస్ 130 శాతం నుంచి 80 శాతానికి తగ్గించారు. దీంతో వడ్డీ రేటును వెంటనే పునరుద్ధరించాలి.

* మారుమూల ప్రాంత ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపక వైద్యులకు ప్రత్యేక అలవెన్స్ మంజూరు చేయాలి.

* బిశ్వాల్ కమిషన్ 20 సంవత్సరాల సర్వీస్‌కు పూర్తి పెన్షన్ మంజూరుకు ప్రతి పాదించింది. కాబట్టి 01/7/2018 నుంచి దీన్ని అమలు చేయాలి.

* ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశపెట్టిన ఉమ్మడి టైం టేబుల్‌ను మార్చాలి. గురుకులాల్లో నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కరించాలి.

* ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి.

* మహిళాభివృద్ధి సంక్షేమ శాఖలో కొత్త జిల్లాల్లో క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ ఫైల్‌ను సీఎం ఆమోదించాలి.

* అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, వర్కర్స్‌కు స్వచ్ఛంద పదవీ విరమణకు అను మతించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను రెం డు లక్షలు, ఒక లక్షకు పెంచడం చే యా లి. విధుల్లో మరణించిన అంగన్వాడీ ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం లాంటి సమస్యలను పరిష్కరించాలి.