2 July, 2026 | 10:54 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

విద్యార్థులకు ఎన్ఆర్ఐ ఆర్థిక సహాయం

24-06-2025 05:21 PM

చండూరు (విజయక్రాంతి): చండూరు ఉన్నత పాఠశాలలో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అమెరికాకు చెందిన నంద్యాల కిరణ్ కుమార్ రెడ్డి పదివేల ఆర్థిక సహాయం అందించారు. గత పదవ తరగతి ఫలితాలలో స్కూల్ టాపర్ గా నిలిచిన సరిపెల్లి మోనికకు ఐదువేలు, ఎన్ఎంఎంఎస్ పరీక్ష(NMMS Exam)లో ఎంపికైన సంగెపు రాఘవేంద్రకు ఐదువేల రూపాయల చొప్పున ప్రధానోపాధ్యాయులు ఎడ్ల బిక్షం అందించారు.

కనగల్ మండలం రాయి బావి గూడానికి చెందిన నంద్యాల కిరణ్ కుమార్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన బొమ్మరబోయిన సైదులు అనే ఉపాధ్యాయుడి ద్వారా నగదు బహుమతిని పంపించినందుకు ప్రధానోపాధ్యాయులు వారిద్దరిని అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఈరోజు వారికి నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయిని కట్ట మమత పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.