2 July, 2026 | 12:14 PM

Breaking News

స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •  

గొర్రెల చోరీ ముఠా అరెస్ట్‌..

24-06-2025 05:18 PM

దేవరకొండ: గొర్రెల, మేకల షెడ్ లోనీ గొర్రెలను వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్ జిల్లా నిందితులను మంగళవారం కొండమల్లేపల్లి పోలీసులు(Kondamallepally Police) పట్టుకున్నారు. ఇటీవల కొండమల్లేపల్లి, నాంపల్లి, గుర్రంపోడు మండలాల్లో వరుస గొర్రెల, మేకల దొంగతనాలకు పాల్పడిన నలుగురు అంతర్ జిల్లా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నాలుగు కేసులలో కలిపి 32 గొర్రెలను, మేకలను నిందితులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని అలాగే వీరి వద్ద నుంచి రెండు లక్షల ఇరవై వేల రూపాయలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు కొండమల్లేపల్లి ఇన్చార్జి సిఐ రాజు(In-charge CI Raju) తెలిపారు. ఇట్టి కేసును ఛేదించిన కొండమల్లేపల్లి ఎస్సై అజ్మీర రమేష్ నాయక్, ఐడి పార్టీ సిబ్బంది హేము నాయక్, భాస్కర్, నవీన్ రెడ్డిలను ఇంచార్జ్ సిఐ అభినందించారు.