calender_icon.png 15 November, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌ఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాం

15-11-2025 12:00:00 AM

ఘట్ కేసర్, నవంబర్ 14 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ప్రేరణాత్మక ఎన్.ఎస్.ఎస్. ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేష్, డీన్ డాక్టర్ పి. నారాయణరెడ్డి, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి. దివాకర్ రెడ్డి, ఎన్.ఎస్.ఎస్. ట్రైనర్ సాగర్, బీసే డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీధర్ గౌరవ అతిథులుగా విచ్చేశారు.

వారి ప్రేరణాత్మక మాటలు విద్యార్థుల్లో సేవాస్ఫూర్తి నింపాయి. ఎన్.ఎస్.ఎస్. కార్యకలాపాలపై వీడియో ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం చివరగా ఎన్.ఎస్.ఎస్. గీతం, జాతీయ గీతంతో ముగిసింది.