15-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 14 (విజయకాంతి) : అంతర్జాతీయ మధుమేహ దినోత్స వం, బాలల దినోత్సవం సందర్భంగా జీవీకే హెల్త్ హబ్‌లో శుక్రవారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. చిన్నతనం నుంచి టైప్-1 మధుమేహం ఉండి, దాన్ని విజయవంతంగా అధిగమిస్తూ ఇప్పుడు పెళ్లిళ్లు కూడా అయిన కొంతమంది.. ఇప్పుడిప్పుడే దాని గురించి తెలిసి ఇబ్బంది పడుతున్న పిల్లలకు అవగాహన కల్పించారు.
నాలుగైదేళ్ల వయసులో టైప్-1 మధుమేహం ఉండి, ఏం తినాలో ఏం తినకూడదో కూడా సరిగా తెలియని పిల్లలకు.. తాము ఇన్నాళ్ల నుంచి ఎలా దాన్ని అధిగమిస్తున్నామన్న విషయా న్ని సమగ్రంగా వివరించారు.ఉదయం 6.30 గంటలకు కేబీఆర్ పార్క్ నుంచి జీవీకే హెల్త్ హబ్ వరకు డయాబెటిస్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీకే డయాబె టిస్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్‌జీ శాస్త్రి మాట్లాడుతూ, మధుమేహం వల్ల రక్తనాళాలు ప్రభావితం అవుతున్నాయన్నారు. దీంతో చిన్నవయసులోనే గుండె, మూత్రపిండాల సమస్యలు తలెత్తుతున్నాయి.
మన దేశం మధుమేహం విషయంలో ప్రపంచ రాజధానిగా ఉంది. దీనిపై అందరికీ అవగాహన కల్పించేందుకే ఈ వాక్ నిర్వహించా మని తెలిపారు. ఈ సందర్భంగా టైప్-1 మధుమేహానికి ఉచిత చికిత్స అందించడంతో పాటు వైద్యపరీక్షలు కూడా నిర్వహిం చారు. ఈ కార్యక్రమాల్లో కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శివ, కన్సల్టెంట్ డయాబెటాల జిస్ట్ డాక్టర్ దీపిక, భారీ సంఖ్యలో వైద్యులు, ఆస్పత్రి సీఓఓ జె.సుమన్ రాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.