15-11-2025 12:00:00 AM
వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణ
ఖమ్మం, నవంబర్ 14(విజయక్రాంతి): తెలంగాణలోనే అతిపెద్ద ఆటోమొబైల్ గ్రూ ప్ వీవీసీ అండ్ వీర్‌ఏ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ స్వర్గీయ వంకాయలపాటి రమణ ప్రసా ద్ 62 వ జయంతి వేడుకలను వీవీసీ గార్డెన్, మమత రోడ్ ఖమ్మంలో శుక్రవారం ఘనం గా నిర్వహించారు. ముఖ్య అతితిగా గ్రూప్ చైర్మన్ వీవీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొని రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వీవీసీ అండ్ వీర్‌ఏ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా సంస్థ సిబ్బంది 75 యూనిట్ల రక్తదానం చేసి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్‌కి అందజేశారు. కమ్మ మహాజనసంఘం, ఖమ్మం వారికి వీవీసీ ట్రస్ట్ ద్వారా ఒక లక్ష రూపాయల చెక్‌ను విరాళంగా ప్రెసిడెంట్, సెక్రెటరీ సత్యనారాయణ, చావా రాములకు అందజేశారు.
వీవీసీ ట్రాక్టర్ (జోన్ డియర్ షో రూం) నందు పని చేస్తున్న కాసాని సతీష్‌కు గత నెలలో ఆక్సిడెంట్ కాగా వీవీసీ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల చెక్కును రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం దాదాపు వెయ్యి మందికి అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో సంస్థ బాధ్యులు వంకాయలపాటి ద్రౌపతి, కుటుం బ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.