27 July, 2026 | 6:58 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఎన్ఎస్ఎస్ వాలంటరీలు యూనిఫామ్ లేని భారత సైనికులు

01-04-2026 04:43 PM

- కేయూ ఈసీ మెంబర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్

హనుమకొండ,(విజయక్రాంతి): ఎన్ఎస్ఎస్ వాలంటరీ అంటేనే యూనిఫామ్ లేని భారత సైనికులని కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్ చిర్ర రాజు గౌడ్  అన్నారు. హాసన్ పర్తి మండలంలోని నాగారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చిర్ర రాజు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడారు. మదర్ తెరిసా, స్వామి వివేకానందుని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, వ్యసనాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ప్రోగ్రాం ఆఫీసర్ డా.రాధిక, నాగారం గ్రామ సర్పంచ్ లావణ్య-సంతోష్ దంపతులు, గ్రామ కార్యదర్శి ప్రశాంతి, వార్డ్ మెంబర్ శ్రీవిద్య, కేయూ బయోటెక్నాలజీ విభాగం ఎన్ఎస్ఎస్ వాలంటరీస్ 50 మంది విద్యార్థులు 7 రోజులు వివిధ సేవా కార్యక్రమాలు చేయడం కోసం నాగారం గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.