15 July, 2026 | 12:41 PM

Breaking News

ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •   జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు   •   ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి   •   పెరిగిన రూపాయి విలువ.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు   •   ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు   •  

19న ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో

18-11-2024 12:27 AM

న్యూఢిల్లీ, నవంబర్ 17: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీకి రెన్యువబుల్ ఎనర్జీ సబ్సిడరీ ఎన్టీపీసీ గ్రీన్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ వారమే ప్రారంభం కానుం ది. బుక్‌బిల్ట్ మార్గంలో 92.59 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీచేసి రూ. 10,000 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ ప్రతిపాదన. ఆఫర్ నవంబర్ 19న ప్రారంభమై 22న ముగుస్తుంది. ఐపీవోలో రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరును రూ.102-108 ప్రైస్‌బ్యాండ్‌తో ఆఫర్ చేస్తారు. ఐపీవో లాట్ సైజ్ ఒక్కోటి 138 షేర్లు ఉంటుంది. నవంబర్ 27న లిస్టవుతుందని అంచనా.