calender_icon.png 21 January, 2026 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యతరగతికి ఊరట కల్పిస్తాం

18-11-2024 12:28:28 AM

సీతారామన్

న్యూఢిల్లీ, నవంబర్ 17: మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఒత్తిళ్లకు ఊరటనిచ్చే చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారంతో మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయని, ప్రభుత్వం కొంత ఊరట కల్పించాలంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక యూజర్ చేసిన విజ్ఞప్తికి సీతారామన్ స్పందిస్తూ ఈ సమస్యలను అర్థం చేసుకున్నామని, ప్రస్తుత, భవిష్యత్ చర్యల ద్వారా వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు.