ఎన్టీఆర్ సేవలు శ్లాగనీయం
28-05-2026 03:14 PM
ఖానాపూర్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
ఖానాపూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేసిన సేవలు అమోఘం, స్లాగనీయమని తెలుగుదేశం పార్టీ నాయకుడు కొండాజీ సాయి ప్రసాద్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ చౌరస్తాలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొని పండ్లు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు కొనియాడారు. అందరికీ చేయూతనిచ్చిన మహా వ్యక్తి చిరస్మరణీయుడు ,నందమూరి తారక రామారావు అని కొనియాడారు.






