17 April, 2026 | 3:29 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సాహితీవేత్త పెద్దిరెడ్డి గణేష్ కు ఎన్టీఆర్ స్మారక అవార్డు

30-05-2025 11:38 PM

సూర్యాపేట(విజయక్రాంతి):  విజయవాడకు చెందిన ప్రముఖ ఎక్స్ రే సాంస్కృతిక సంస్థ ప్రతి ఏటా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని స్మారక అవార్డులను అందజేస్తుంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాలలో ప్రముఖులైన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మనం వికాస వేదిక స్థాపించి, గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన సూర్యాపేటకు చెందిన పెద్దిరెడ్డి గణేష్ ను ఈ అవార్డ్ వరించింది. నేడు విజయవాడలోనీ సిద్దార్థ కళాశాల ఆడిటోరియంలో ఈ అవార్డ్ ప్రధానం జరగనున్నది.  

ఈ అవార్డును ప్రముఖ నటులు

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కు ఎన్టీఆర్ విశిష్ట పురస్కారాన్ని ఇవ్వనున్నారు. పెద్దిరెడ్డి గణేష్ కు ఈ అవార్డ్ రావటం తో జిల్లా వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులు శుభాకాంక్షలు తెలిపారు.