calender_icon.png 18 November, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌టీఆర్ వీరాభిమాని అగయ్య ఇక లేరు

18-11-2025 12:02:04 AM

కరీంనగర్, నవంబరు 17 (విజయ క్రాంతి): ఎన్టీఆర్ వీరాభిమాని, కరీంనగర్ కు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు కళ్యాడపు ఆగయ్య(72) సోమవారం కన్నుమూ శారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని వీడకుండా ఉన్న కరీంనగర్ నేత అగయ్య గుండె పోటుతో తుది శ్వాశ విడిచారు. ప్రస్తుతం కరీంనగర్ టిడిపి నియో జకవర్గ కన్వీనర్ గా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఆగయ్య పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇటీవలే మహానాడులో ఆగయ్యను చంద్రబాబు, సినీ నటుడు బాలకృష్ణ సన్మానిం చారు. ఎక్కడున్నా పేరు పెట్టి పిలిచేంతగా ఎన్టీఆర్ కుటుంబంలో తెలిసిన వ్యక్తిగా ఆగయ్యకు గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచే ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆగయ్య మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

ఆగన్న మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది:రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అజాతశత్రువు కళ్యాడపు ఆగయ్య మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మహానేత ఎన్.టి. రామారావు ప్రియమైన శిష్యునిగా ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి విశ్వాసపాత్రునిగా పనిచేసిన ఆగయ్య జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. విలువలతో కూడిన రాజకీయాలను చేసిన ఆయన ఎంతోమందికి ఆదర్శం. అంత గొప్ప నాయకులు దూరమవడం నిజంగా బాధాకరం. కళ్యాడపు ఆగ య్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలిజేస్తున్నాను.

 బ్రతికినా తెలుగుదేశమే సచ్చినా తెలుగుదేశమే పసుపు జెండా వదలని కళ్యాణపు ఆగన్న: టిడిపి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వంచ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షులు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నందమూరి తారక రామారావు కరుడుగట్టిన వీర అభిమానిగా పేరుగాంచిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కళ్యాడపు ఆగయ్య మరణ వార్త తెలిసి చింతిస్తున్నాము. తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించిన గొప్ప సీనియర్ నాయకులు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిని పార్టీ కోల్పోవడం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాము. ఆయ న పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.